పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా.. నాన్ లోకల్ అయినా చేర్చుకోవాల్సిందే: ఆసుపత్రులకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

ప్రస్తుతం దేశంలో కోవిడ్ విలయతాండవం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనూ నియమ నిబంధనల పేరిట అధికారులు, ఆసుపత్రుల సిబ్బంది తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితులకు కేంద్రం కాస్త ఉపశమనం కల్పించింది.

positive test for covid 19 virus now not mandatory for admission in hospital ksp

ప్రస్తుతం దేశంలో కోవిడ్ విలయతాండవం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనూ నియమ నిబంధనల పేరిట అధికారులు, ఆసుపత్రుల సిబ్బంది తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితులకు కేంద్రం కాస్త ఉపశమనం కల్పించింది.

వైరస్ బారినపడిన వారు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్‌ రిపోర్ట్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా , ఏ కారణంగానైనా రోగులకు వైద్య సేవలు నిరాకరించరాదని వెల్లడించింది. ఈ మేరకు కొవిడ్‌ బాధితుల సౌకర్యార్థం నేషనల్ పాలసీ ఫర్‌ అడ్మిషన్‌ ఆఫ్‌ కొవిడ్‌ పేషెంట్స్‌ విధానంలో భారత ప్రభుత్వం పలు సవరణలు చేసింది.

ఈ మార్పులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆసుపత్రులు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.   

కొత్త గైడ్ లైన్స్:

* కొవిడ్‌ ఆరోగ్య కేంద్రంలో చేర్చుకునేందుకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ పత్రం తప్పనిసరి కాదు. వైరస్‌ అనుమానిత బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్స అందించాల్సిందే.  

* కారణమేదైనా సరే.. ఏ రోగికి కూడా వైద్య సేవలు నిరాకరించొద్దు. వేరే ప్రాంతానికి చెందిన రోగులకు కూడా ఆక్సిజన్‌ లేదా అత్యవసర ఔషధాలు ఇవ్వాలి.   

* వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ధ్రువీకరణ పత్రాల పేరిట ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా ఉండొద్దు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చేర్చుకోవాలి.  

* అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్‌ పాలసీని కచ్చితంగా పాటించాలి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆధారంగానే చేసుకునే ఆసుపత్రిలో చేర్చుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స అవసరం లేనివారిని డిశ్చార్జ్‌ చేయాలి.
 
ఈ నూతన మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మూడు రోజుల్లోగా ఉత్తర్వులు, సర్క్యులర్లు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios