Asianet News TeluguAsianet News Telugu

రాజ్ కుంద్రా : ఐబీ అధికారి భార్య పేరుతో యాప్.. షార్ట్ ఫిల్మ్స్ పేరుతో అశ్లీల చిత్రాలు..

ఇందుకుగాను రాజ్ కుంద్రా ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకుర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది. 

Pornography Case : Flizz Movies App Registered In Name Of Wife Of IB Officer - bsb
Author
Hyderabad, First Published Jul 27, 2021, 1:06 PM IST

రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోర్నోగ్రఫీ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్ న్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో కుంద్రా ప్లాన్-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీ ఫేమ్ పేరుతో మరో యాప్ ను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగించారని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇందుకుగాను రాజ్ కుంద్రా ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకుర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది. 

ఈ క్రమంలో అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలిమ్స్ ను ప్రసారం చేసేందుకు యాప్ ను ఏర్పాటు చేద్దామని యష్ ఠాకూర్.. సదరు ఐబీ అధికారి వద్ద ప్రతిపాదించాడు. అందుకు అంగీకరించిన ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్ ను రిజిస్టర్ చేశాడు. 

అయితే ఆ యాప్ లో అశ్లీల చిత్రాలను అప్ లోడ్ చేయడంతో అతడు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. కుంద్రా అరెస్టుపై మరుసటి రోజు ఆ యాప్ నుంచి పోర్న్ చిత్రాలను తొలగించమని తమకు చెప్పినట్లు ఈ కేసులో సాక్షులుగా మారిన కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు తెలిపారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ నటి షెర్లిన్ చోప్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios