ఐఐటీ వదిలేసి మరీ కమెడియన్ అయ్యాడు.. ఇతని సంపాదనెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఐఐటీ చదువుతున్నారంటే.. మంచి లక్షలొచ్చే జాబ్ చేయాలని పక్కాగా అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఐఐటీని వదిలేసి మరీ.. స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. అంతేకాదు అతని సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు కూడాను.
బిశ్వ కల్యాణ్ రథ్ భారతదేశంలోని ఒడిషాకు చెందిన స్టాండప్-కమెడియన్. ఈ సంగతి అందరికీ తెలుసు. అంతేకాదు ఇతను యూట్యూబర్, రచయిత కూడా. తోటి కమెడియన్ కనన్ గిల్ తో కలిసి నటించిన యూట్యూబ్ కామెడీ సిరీస్ 'ప్రెజెంట్ మూవీ రివ్యూస్'తో ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇంజనీర్ నుంచి కమెడియన్ గా మారిన బిశ్వాకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. యూట్యూబ్ లో 6.82 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 4.06 లక్షల మంది సబ్ స్క్రైబర్లతో దేశంలోనే ప్రముఖ స్టాండప్ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు బిశ్వ కల్యాణ్ రథ్.
బిశ్వ తండ్రి జగన్ మోహన్ రథ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తారు. బిశ్వ ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేట్, 2012లో తన కోర్సును పూర్తి చేశారు. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత బిశ్వ కళ్యాణ్ రథ్ సేల్స్ ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం నెలకు 15,000 రూపాయలు. అయితే 3 నెలల తర్వాత బిస్వాను ఆ ఉద్యోగం నుంచి తీసేసారు. ఆ తర్వాత అతను మొబైల్ అప్లికేషన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన బిట్జర్ మొబైల్లో యుఐ / యుఎక్స్ డిజైనర్ గా చేరాడు. ఈ కంపెనీని 2013 నవంబర్ లో ఒరాకిల్ కొనుగోలు చేసింది. అదే ఏడాది బెంగళూరులో జరిగిన ఓపెన్ మైక్ ఈవెంట్ లో కనన్ గిల్ ను కలిసే అవకాశం బిస్వాకు లభించింది. ఒరాకిల్ లో తన ఉద్యోగాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఫుల్ టైమ్ కమెడియన్ గా కెరీర్ ను కొనసాగించాలని నిర్ణయించుకున్న మాట బిస్వా జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఐఐటీ రోజుల్లోనే తనకు ఇంజినీరింగ్ కంటే జోక్ అంటే చాలా ఇష్టమని తెలుసుకున్నాడు. ఆ తర్వాత సీరియస్ గా ఆలోచించి కమెడియన్ గా కావాలనుకున్నాడట.
యూట్యూబ్ షో 'క్రేజీ మూవీ రివ్యూ' ఇన్ స్టంట్ హిట్ కావడంతో 2014లో బిస్వా, కన్నన్ ఫేమస్ అయ్యారు. వరుస వీడియోల ద్వారా వీరిద్దరూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తర్వాత బిస్వా కళ్యాణ్ రథ్ 2017 లో స్టాండప్ కామెడీ షో బిస్వా మస్త్ ఆద్మీ, 2018 లో ఇంప్రూవ్ ఆల్ స్టార్స్ - గేమ్స్ నైట్ , 2019 లో సుషి - కామెడీ షో వంటి అనేక కామెడీ షోలలో కనిపించారు.
బిస్వా తన ప్రొఫెషనల్ కెరీర్లో సన్ ఆఫ్ అబిష్, ఏఐబీ వీడియో పాడ్కాస్ట్ వంటి యూట్యూబ్ షోలలో అతిథి పాత్రలు పోషించారు. 2018లో 'హెచ్డీఎఫ్సీ లైఫ్స్ బిహైండ్ ది జర్నీ'లో నటించారు. రచయితగా బిస్వా కామెడీ షో 'లఖోన్ మే ఏక్' సీజన్ 1, 2లకు ఎంతో సహకారం అందించారు. అతను భారతీయ స్టాండప్ కామెడీ పోటీ టెలివిజన్ సిరీస్ అయిన కామిక్స్టాన్ మొదటి, రెండో సీజన్లలో జడ్జి పాత్ర పోషించాడు.
కాగా బిస్వా డిసెంబర్ 9, 2020న ఇండియన్ టెలివిజన్, సినిమా నటి సులగ్నా పాణిగ్రాహిని వివాహం చేసుకున్నారు. ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన బాలీవుడ్ మూవీ మర్డర్ 2లో సులగ్న నటన ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అంతేకాదు ఈమె ఇష్క్ వాలా లవ్, ఇసాయి, గురు దక్షిణ, రైడ్ వంటి పలు ఇతర హిందీ సినిమాల్లో కూడా నటించింది.
బిస్వా ఆదాయం 15.4 వేల డాలర్ల నుంచి 92.6 వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. షోస్ , స్టాండప్ కామెడీలే ఆయన ప్రధాన ఆదాయ వనరు. అంతే కాకుండా కామెడీ షోలలో జడ్జ్ గా ఉంటూ ఆదాయం కూడా సంపాదిస్తున్నాడు ఈ స్టాండప్ కమెడియన్.