న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్  నిధుల గోల్ మాల్ కు సంబంధించిన విషయంలో ఈడీ ఆయనను ప్రశ్నిస్తోంది.

జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్డికట్ ను  పునరుద్దరించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడగట్టడంలో ఫరూక్ అబ్దుల్లా కీలకపాత్ర పోసించారు.

జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కు 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీతో పాటు మరో ముగ్గురికిపై కేసు పెట్టారు. 2002-11 మధ్యలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టుగా సీబీఐ ఆరోపించారు.

సుమారు 43.69 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టుగా సీబీఐ కేసు నమోదు చేసింది. గుప్కార్ డిక్లరేషన్ వెలువడిన తర్వాత ఈడీ లెటర్ వెలుగు చూసింది. ఈడీ అధికారులు ప్రశ్నించడం రాజకీయ పరమైందని ఎన్సీపీ ఆరోపిస్తోంది. 

పీపుల్స్ అలయన్స్ ను కాశ్మీర్ లో ఏర్పాటు చేసిన తర్వాత ఈడీ ప్రశ్నించడాన్ని ఎన్సీపీ అధికార ప్రతినిధి  తప్పుబట్టారు.రాజకీయంగా పోరాటం చేయలేని బీజేపీ... ఈ రకంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఎన్సీపీ ఆరోపణలు చేసింది.

దేశంలోని బీజేపీయేతర పార్టీలకు చెందిన నేతలను కొన్ని శాఖలను ఉపయోగించుకొని ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు కూడ ఇదే కోవలోకి వస్తాయని  ఎన్సీపీ అభిప్రాయపడింది.