Asianet News TeluguAsianet News Telugu

సోమ్ నాథ్ చటర్జీ మృతికి ప్రముఖుల సంతాపం, ఎవరెవరు ఏమన్నారంటే...

రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం. రాజకీయాలంటే ఎలా ఉండాలో, రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర ముఖ్యంగా రాజకీయ జీవితం గురించి తెలుసుకోవాల్సింది. నిబద్దత, పారదర్శకత కోసం తాను నమ్ముకున్న పార్టీనే వదిలేసి నిస్పక్షపాత రాజకీయాలవైపు మొగ్గుచూపిన ధీరుడు. ఆయన ఎవరో కాదు మాజీ పార్లమెంట్ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ. కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన  ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు.

political Leaders Pay Tribute To Somnath Chatterjee
Author
West Bengal, First Published Aug 13, 2018, 12:20 PM IST

రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం. రాజకీయాలంటే ఎలా ఉండాలో, రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర ముఖ్యంగా రాజకీయ జీవితం గురించి తెలుసుకోవాల్సింది. నిబద్దత, పారదర్శకత కోసం తాను నమ్ముకున్న పార్టీనే వదిలేసి నిస్పక్షపాత రాజకీయాలవైపు మొగ్గుచూపిన ధీరుడు. ఆయన ఎవరో కాదు మాజీ పార్లమెంట్ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ. కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన  ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు.

సోమ్ సాథ్ చటర్జీ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రధాని మోధీతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చాలా మంది ప్రముఖులు ట్వీట్లు చేశారు. ఎవరెవరు ఏమన్నారో ఓసారి చూద్దాం. 

  
1. ప్రధాని నరేంద్ర మోదీ:

మాజీ లోక్ సభ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ భారత రాజకీయాల్లో ఓ పటిష్టమైన నాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం చూపిన పోరాట పటిమ భవిష్యత్ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పార్లమెంట్ వ్యవస్థను ఆయన ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారని అన్నారు. అలాంటి గొప్ప నాయకున్ని కోల్పోవడం బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

 

2. రాహుల్ గాంధీ:

మాజీ లోక్‌సభ స్పీకర్, 10 సార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన సోమ్ నాథ్ చటర్జీ మృతిపట్లు సంతాపం ప్రకటిస్తున్నట్లు ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయనను ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకతీతంగా గౌరవించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయనే ఒక రాజకీయ గ్రంథమని రాహుల్ పొగిడారు. ఆయన మృతితో విషాదంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాహుల్ సానుభూతి  ప్రకటించారు.  

 

3. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్:

సోమ్ నాథ్ చటర్జీ మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.  పార్లమెంట్ సభ్యుడిగాను, స్పీకర్ గా  ఓ బలమైన నాయకుడిగా ఆయన ఎదిగారన్నారు. సోమ్ నాథ్ కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు.  

 

 

4. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ:

సోమర్ నాథ్ చటర్జీ అకాల మరణం పట్ల సంతాపం తెలిపారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మనందరం ఓ గొప్ప నాయకున్ని కోల్పోయామంటూ మమత ట్వీట్ చేశారు.

 

 
 5. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్:

సోమ్ నాథ్ చటర్జీ మరణ వార్త విని తాను షాక్ కు గురయ్యానని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. బలమైన ఎంపీగా, మంచి వాక్చాతుర్యం గల నేతగా ఆయన లోక్ సభలో ప్రజల పక్షాన పోరాటం చేసేవాడని గుర్తుచేశారు. ఆయన మరణం భారత ప్రజాస్వామ్యానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నవీన్ పట్నాయక్ సానుభూతి ప్రకటించారు. 

 
 6. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ:

అసాధారణమైన పార్లమెంటేరియన్‌గా, రాజ్యాంగవేత్తగా సోమ్ నాథ్ చటర్జీ భారత దేశానికి సేవలు అందించారని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ అన్నారు. ఆయన మృతితో తాను ఓ వ్యక్తిగత స్నేహితున్ని కోల్పోయానని అన్నారు. దేశం కూడా ఓ మంచి కొడుకును కోల్పోయిందన్నారు. ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నట్లు ప్రణబ్ ట్వీట్ చేశారు.

 


  

Follow Us:
Download App:
  • android
  • ios