Asianet News TeluguAsianet News Telugu

‘ పార్ల మెంట్, కన్న తల్లి ముందు మాత్రమే తలొంచే వ్యక్తి’... మోదీకి ప్రముఖుల విషెస్

ట్విట్టర్‌లో మోదీ పుట్టిన రోజుకు సంబంధించి మూడు ట్రెండింగ్స్ నడుస్తుండటాన్ని బట్టీ ఆయన పట్ల ప్రజల్లో అభిమానం ఉందో చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితదరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

political leaders Birthday wishes to PM Narendra modi
Author
Hyderabad, First Published Sep 17, 2019, 11:54 AM IST

ప్రధాని నరేంద్రమోదీ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌లో మోదీ పుట్టిన రోజుకు సంబంధించి మూడు ట్రెండింగ్స్ నడుస్తుండటాన్ని బట్టీ ఆయన పట్ల ప్రజల్లో అభిమానం ఉందో చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితదరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

‘గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంత ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్  ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

టీం ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ తన తల్లికి ఎటువంటి గౌరవం ఇస్తారో... పార్లమెంట్ కి కూడా అంతే గౌరవం ఇస్తారని  గంభీర్ పేర్కొన్నారు. కేవలం తన కన్న తల్లి, పార్లమెంట్ ముందు మాత్రమే మోదీ తల వొంచుతారని అభిప్రాయపడ్డారు. అనంతరం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

పుట్టిన రోజు శుభాకంక్షలు ప్రధాని నరేంద్రమోదీ జీ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఇంగ్లీష్ తోపాటు బెంగాల్ భాషలో కూడా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలంటూ ట్వీట్ చేశారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios