Assom CM Himanta Biswa Sharma: కర్ణాటక హిజాబ్ వివాదం ఆధారంగా దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంద‌నీ, ఈ విష‌యంలో కాంగ్రెస్ తీరు ఆందోళనకరంగా ఉందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ  ఆరోపించారు. ఈ వివాదానికి  'తుక్డే తుక్డే (కాంగ్రెస్) ముఠాకు ప్రాతినిధ్యం వహిస్తోందని ఆరోపించారు. దేశంలో 1947కి ముందు పరిస్థితుల‌ను పునరావృతం చేయాల‌ని కాంగ్రెస్‌ లక్ష్యం పెట్టుకుంద‌ని ఆరోపించారు.

Assom CM Himanta Biswa Sharma: హిజాబ్ వివాదంతో కర్నాటక రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇలానే కొనసాగితే.. హిందూ, ముస్లిం ఘర్షణలు తీవ్ర‌మ‌వుతాయ‌ని, పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెలరేగడం ఖాయమని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. హిజాబ్ ధరించిన విద్యార్థులను క్లాసులకు అనుమతించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రానురాను అది పెద్ద వివాదంగా మారింది. తాజాగా ఈ వివాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. 

తరగతి గదిలో విద్యార్థునులు హిజాబ్ ధరిస్తే.. వారికి పాఠాలు అర్థమయ్యేయో..? లేదో..? అనే విషయం ఉపాధ్యాయుడికి ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. ముస్లిం సమాజానికి విద్య అవసరం, హిజాబ్ కాదని అన్నారు. ఈ వివాదాన్ని రాజ‌కీయం చేయ‌డం కాంగ్రెస్ కు అవ‌స‌ర‌మ‌ని ఆరోపించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన హిజాబ్‌పై ఈ విధంగా స్పందించారు. 

కర్ణాటక హిజాబ్ వివాదం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్త‌మ‌య్యింది. ఈ వివాదంపై దేశం పోరాడుతోందనీ.. ఈ వివాదం ఆధారంగా చేసుకుని దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంద‌నీ, వారి తీరు ఆందోళనకరంగా ఉందని ఆరోపించారు. ఈ వివాదానికి 'తుక్డే తుక్డే' ముఠాకు ప్రాతినిధ్యం వహిస్తోందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో 1947కి ముందు పరిస్థితుల‌ను పునరావృతం చేయాల‌ని లక్ష్యం పెట్టుకుంద‌ని ఆరోపించారు.

 త‌ర‌గ‌తి గ‌దుల్లో హిజాబ్ ధరించడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ముస్లిం సమాజానికి విద్యే అవసరమని, హిజాబ్‌ కాదని అన్నారు. తాను రెండు రకాల ఇస్లాంను అర్థం చేసుకున్నాననీ, ఒకటి మతపరమైన ఇస్లామ‌నీ, మరొకటి రాజకీయ ఇస్లామ‌నీ అన్నారు. మతపరమైన ఇస్లాంలో ఖురాన్ ప్రకారం మంచి విషయాలు రాశారనీ. ఇంకోటి రాజకీయ ఇస్లాం దానిని కాంగ్రెస్ స్పాన్సర్ చేసిందనీ, ఏ రాజకీయాలు జరుగుతున్నాయో చూడండి, కోర్టులో హిజాబ్ ధరించడాన్ని సమర్థిస్తున్న లాయర్లందరూ కాంగ్రెస్‌కు చెందిన వారేన‌నీ, ఇదంతా తుక్డే తుక్డే పార్టీనే చేస్తుందని హిమంత బిస్వా ఆరోపించారు.

కాగా హిజాబ్ వివాదంపై అత్యవసరన విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంలో సుప్రీంకోర్టు జోక్యానికి స‌రైన స‌మ‌యం కాద‌ని, ఈ స‌మ‌స్యను మ‌రింత పెద్ద‌గా చేయొద్ద‌ని సుప్రీం హెచ్చ‌రించింది. ఈ సమస్యపై తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ మత పరమైన దుస్తులతో కాలేజీలకు వెళ్లొద్దంటూ కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.