Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో పొలిటిక‌ల్ హీట్.. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టిన భ‌గ‌వంత్ మాన్

Bhagwant Mann: పంజాబ్  ముఖ్య‌మంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) కుట్రకు పాల్ప‌డుతున్న‌ద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంలో పొలిటిక‌ల్ హైప్ క్రియేట్ అయింది. 
 

Political heat in Punjab. Bhagwant Mann moves confidence motion in Assembly
Author
First Published Sep 27, 2022, 3:47 PM IST

Punjab Assembly: పంజాబ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. పంజాబ్, బీజేపీ నాయకుల మధ్య వార్ ముదురుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని మూడు కోట్ల మంది ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విశ్వాసం ఉందని పేర్కొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీ త‌న ఎమ్మెల్యేల‌కు డ‌బ్బు ఆఫ‌ర్ చేసి త‌మ ఆప్ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని అక్క‌డి మంత్రులు ఆరోపించిన కొద్ది రోజుల తర్వాత భగవంత్ మాన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. 

భాజపాపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన భగవంత్ మాన్, అన్ని చోట్లా తాము మాత్రమే అధికారంలో ఉండాలని పార్టీ భావిస్తోందని అన్నారు. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’కు కాంగ్రెస్ మద్దతిస్తోందని ఆరోపించారు. 'ఆపరేషన్ లోటస్'కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందనీ, అందుకే దాని ఎమ్మెల్యేలు చర్చకు దూరంగా పారిపోయారని భగవంత్ మాన్ విమ‌ర్శించారు. 

రాజ్ భ‌వ‌న్ వ‌ర్సెస్ స‌ర్కారు

రాజ్ భవన్ వ‌ర్సెస్ ఆప్ ప్రభుత్వం కొన‌సాగుతున్న వాగ్వాదం మ‌ధ్య ఎట్ట‌కేల‌కు గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు ఒకే చెప్పారు. అంత‌కు ముందు బీజేపీ నాయ‌కులు ఆప్ ప్ర‌భుత్వం చేసిన విమ‌ర్శ‌లు, ఆప‌రేష‌న్ క‌మ‌ళ్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం విశ్వాస తీర్మానం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే సెప్టెంబర్‌ 22వ తేదీనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయ‌డానికి ఆమ్ ఆద్మీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే, కేవ‌లం విశ్వాస తీర్మానం కోసమని ప్రభుత్వం అసెంబ్లీ స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డానికి గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్ నో చెప్పారు. అయితే, విశ్వాస తీర్మానంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ఆప్ స‌ర్కారు చెప్ప‌డంతో  గవర్నర్‌ సెప్టెంబర్ 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఒకే చెప్పారు.

అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

అసెంబ్లీ స‌మావేశాల ఏర్పాటు విష‌యంలో గ‌వ‌ర్న‌ర్, ప్ర‌తిప‌క్షాల‌, అధికార ప‌క్షం మ‌ధ్య వాగ్వాదం కొన‌సాగుతున్న త‌రుణంలోనే.. గవర్నర్ ఎట్టకేలకు సెప్టెంబర్ 27న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు ఒకే చెప్పారు. విశ్వాస తీర్మానం కోసం సెప్టెంబర్ 22న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆప్ ప్రభుత్వం గతంలో కోరింది. బీజేపీ తమ 10 మంది ఎమ్మెల్యేలను సంప్రదించిందని, తమ పార్టీలో చేరి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని ఆప్ పేర్కొంది. ఇక తాజా అసెంబ్లీ సమావేశాల్లో భ‌గ‌వంత్ మాన్ విశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. స్పీకర్‌ కుల్టార్‌సింగ్‌ సంధ్‌వాన్‌ అసెంబ్లీలో మాన్‌ విశ్వాస తీర్మాన ప్రకటన చేశారు. దీంతో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య‌నే అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్‌ 3వ తేదీ వరకు పొడిగించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో నిర్ణయించినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

ఆప్ వాద‌న‌లు ఖండించిన బీజేపీ 

అంత‌కుముదు, బీజేపీ తమ 10 మంది ఎమ్మెల్యేలను సంప్రదించిందనీ, తమ పార్టీలో చేరి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని ఆప్ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ క్ర‌మంలోనే మాజీ ఎంపీ సునీల్‌ జాఖర్‌ మాట్లాడుతూ గేదెను కొనుగోలు చేసేటప్పుడు కూడా దాని గత రికార్డులను ప్రజలు చూస్తారన్నారు. మీ ఎమ్మెల్యేను ఎవరు కొంటారు? 67 మంది ఆప్ ఎమ్మెల్యేలలో 23 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని జాఖర్ తెలిపారు. కాగా, పంజాబ్‌లో 117 మంది సభ్యుల సభలో 92 మంది ఎమ్మెల్యేలతో ఆప్ పూర్తి మెజారిటీని కలిగి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios