కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలకు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దీనిని సాకుగా చేసుకున్న బీజేపీ నేతలు ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని చెబుతున్నారు.

మైనార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని బీజేపీ అంటోంది. అంతేకాకుండా ఈ అంశంపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేసేందుక కాషాద దళం రెడీ అవుతోంది. బీజేపీ చిలీక భయంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ రిసార్ట్‌లో ఉంచింది.

అయితే వారిలో కొంతమంది ఇంతవరకు బైంగళూరు చేరుకోలేదు. వీరంతా గత కొన్ని రోజులుగా శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. మరోవైపు అసెంబ్లీకి హాజరుకావాల్సిందిగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది.

అయినప్పటికీ సుమారు 20 మంది ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గీత దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.