దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదౌతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనాని అదుపు చేయలేకపోతున్నాం. ఇక ఈ కరోనా ఇంతలా విజృంభిస్తున్నప్పటికీ కొందరు శుభకార్యాలు మాత్రం ఆపడం లేదు.

దేనిపని దానిదే అన్నట్లుగా చాలా మంది శుభకార్యాలకు తలపెడుతున్నారు. అయితే.. అలా కరోనా ని పట్టించుకోకుండా చేస్తున్న ఓ పెళ్లిన పోలీసులు సడెన్ గా వచ్చి ఆపేశారు. వరుడిని, అతని తండ్రిని ఆస్పత్రికి తరలించారు. 

వీరిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడమే దీనికి కారణం. ఈ ఘటన ఉతతరప్రదేశ్‌లోని అమేథీలో జరిగింది. జూన్ 15న ఢిల్లీ నుంచి వరుడి కుటుంబం అమేథీ వచ్చింది. వీళ్ల శాంపిల్స్ సేకరించిన అధికారులు.. టెస్టింగ్‌కు పంపారు. 

దీనికి సంబంధించిన ఫలితాలు పెళ్లి రోజునే వచ్చాయి. వీటిలో వరుడికి, అతని తండ్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో వాళ్లిద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి హాజరైన 10 కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచారు.