ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆటో రిక్షా కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటోను తనిఖీ చేస్తున్న సమయంలో అందులో నుంచి దిగిన ప్రయాణికులను చూసి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఆటోలో ఎంత మంది కూర్చుంటారు ? సాధార‌ణంగా అయితే న‌లుగురు నుంచి ఆరుగురు కూర్చుంటారు. అయితే ఓ ఆటోలో ఉన్న ప్ర‌యాణికులను చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి ఆటోరిక్షాను ఆపారు. అందులో డ్రైవర్ త‌న‌తో పాటు మ‌రో 27 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న విధానాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఇది ఆటోనా లేక‌పోతే లారీనా అని ప‌రేశాన్ అయ్యాడు. ఆటో నుంచి ప్రయాణికులను దించుతూ వారి సంఖ్య‌ను ఒక్కొక్కరిగా లెక్కిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

Scroll to load tweet…

సాధార‌ణంగా ఆటోరిక్షాలో ఆరుగురు కూర్చునే సామ‌ర్థ్యం ఉంటుంది. కానీ ఈ ఆటోలో పిల్ల‌లు, వృద్దులు క‌లిసి ఏకంగా 27 మంది (డ్రైవ‌ర్ కాకుండా) ఉన్నారు. ఆటోను ఆపినప్పుడు వారంతా ఆటోలో ఇరుక్కుపోయి క‌నినించారు. పోలీసులు ఆ ఆటోలో నుంచి ఒక్కొక్క‌రిని కింద‌కు దించి ప‌క్కన నెల‌బెట్టి లెక్క‌పెడుతున్న‌ప్పుడు ఆ దారిలో వెళ్లే ఒక వ్య‌క్తి ఈ త‌తంగం మొత్తాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భూమికి చేరువగా చంద్రుడు.. బుధవారం అతిపెద్ద సూపర్‌మూన్.. ఎప్పుడు చూడాలంటే?

ఫతేపూర్‌లోని బింద్‌కీ కొత్వాలి ప్రాంతంలో ఆటో వేగంగా వెళ్తుండటంతో అక్క‌డే ఉన్న పోలీసు స్పీడ్ గ‌న్ తో దానిని త‌నిఖీ చేశారు. త‌రువాత ఆ వాహ‌నాన్ని పోలీసులు వెంబ‌డించారు. అనంత‌రం దానిని నిలిపివేసి ప్ర‌యాణికుల‌ను కింద‌కి దిగాల‌ని కోరారు. అందులో నుంచి అంత మంది బ‌య‌ట‌కు రావ‌డం చూసి పోలీసులు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. అనంత‌రం ఆ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.