Srinagar Encounter: స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక‌లకు భంగం క‌లిగించ‌డానికి ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శ్రీనగర్‌లోని నౌహటా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది గాయపడగా, ఒక జవాన్‌పై కాల్పులు జరిగాయి.

Srinagar Encounter: 75 వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకల సందర్భంగా ఉగ్ర‌వాదులు దాడులకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇంటెలిజన్సీ సమాచారం మేరకు భ‌ద్ర‌త‌ బలగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భ‌ద్ర‌తా బ‌లాగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అడుగడుగునా తనిఖీ చేపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లోని నౌహటా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది గాయపడగా, జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి లష్కర్‌కు చెందిన ఉగ్రవాదులు ఉపయోగించిన స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఒక ఏకే-74 రైఫిల్, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

Scroll to load tweet…

ఈ ఎన్‌కౌంటర్‌లో సర్ఫరాజ్ అహ్మద్ అనే పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు ట్వీట్ చేశారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది గాయపడ్డాడు. ఘ‌ట‌న స్థలాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. శోధన ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ విషయంలో మరింత సమాచారం అందాల్సి ఉంది.

Scroll to load tweet…


గ్రెనేడ్ దాడి

ఇదిలా ఉంటే..శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో భద్రతా దళ సిబ్బందిపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ గాయపడ్డాడు. అలీ జాన్ రోడ్, ఈద్గా వద్ద భద్రతా బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారని శ్రీనగర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ పేలుడులో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

నిందితులను పట్టుకునేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఇద్దరు ఉగ్రవాదులు తెల్లవారుజామున జరిపిన దాడిలో నలుగురు జవాన్లు మరణించిన రెండు రోజుల తర్వాత గ్రెనేడ్ దాడి జరిగింది.