బిహార్‌లో జైలులో ఉన్న తన కుమారుడికి బెయిల్ కోసం ఓ మహిళ పోలీసు స్టేషన్ వెళ్లింది. ఆ పోలీసు అధికారి ఆ మహిళతో పోలీసు స్టేషన్‌లోనే మసాజ్ చేయించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై వేటు పడింది.

పాట్నా: బిహార్‌లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. జైలులో ఉన్న తన కొడుకుకు బెయిల్ ఇవ్వాలని కోరడానికి వెళ్లిన మహిళతో పోలీసు స్టేషన్‌లోనే పోలీసు అధికారి మసాజ్ చేయించుకున్నారు. పోలీసు స్టేషన్‌లోనే ఆ అధికారి చొక్కా విడిచే ఉన్నాడు. ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు. మరో మహిళ ఆ పోలీసు అధికారి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నది. ఈ వ్యవహారాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. పై అధికారుల వరకు వెళ్లింది. దీంతో ఆ సీనియర్ పోలీసు అధికారిపై వేటు పడింది. బిహార్‌లో సహర్సలోని పోలీసు స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బిహార్‌లోని సహర్సలో నౌహట్ట పోలీసు స్టేషన్ ఉన్నది. ఆ పోలీసు స్టేషన్ పరిధిలోనే దర్హ్రర్ ఔట్‌పోస్టు ఉన్నది. ఆ ఔట్‌పోస్టులోనే సీనియర్ పోలీసు అధికారి శశిభూషణ్ సిన్హా సేవలు అందిస్తున్నారు. మూడు సెకండ్ల నిడివితో ఉన్న ఆ వైరల్ వీడియోలో సీనియర్ పోలీసు అధికారి శశిభూషణ్ సిన్హా చొక్కా విడిచి అర్ధనగ్నంగా కనిపించాడు.

ఆ ఔట్‌పోస్టు పరిధిలోనే ఉండే ఓ గ్రామానికి చెందిన పోలీసు స్టేషన్‌కు వచ్చింది. జైలులో ఉన్న తన కుమారుడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆ మహిళ సీనియర్ పోలీసు అధికారి శశిభూషణ్ సిన్హాకు విజ్ఞప్తి చేశారు. తన కుమారుడి బెయిల్ కోసం వచ్చిన ఆ మహిళతో ఆ పోలీసు అధికారి ఊడిగం చేయించుకున్నాడు. తన కుమారుడిని జైలు నుంచి విడిపించే బాధ్యత తనదేనని ఆమెకు హామీ ఇచ్చాడు. ఆయన తన చొక్కా విప్పి ఆమెతో మర్దనం చేయించుకున్నాడు. ఆమె మర్ధనం చేస్తుండగా ఆ అధికారి న్యాయవాదికి ఫోన్ చేశాడు. ఆమె కుమారుడికి బెయిల్ ఇప్పించడానికి లాయర్‌తో బేరసారాలు ఆడాడు.

Scroll to load tweet…

‘ఆ మహిళ పేదరికం అనుభవిస్తున్నది. కష్టాల్లో ఉన్నది... నేను ఎంత డబ్బు పంపాలి? సరే.. ఆ డబ్బులను ఎన్వలప్‌లో పంపిస్తాను. ఇద్దరు మహిళలు వారి ఆధార్ కార్డులతో నీ దగ్గరకు వస్తారు. అడ్రస్, మొబైల్ నెంబర్‌తో నేను వారిని సోమవారం పంపిస్తాను. నేను నీకు విజ్ఞప్తి చేస్తున్న పప్పు బాబు. నేను ఇప్పటికే నీకు రూ. 10 వేలు పంపి ఉన్నాను’ అని శశిభూషణ్ సిన్హా.. ఆ న్యాయవాదితో ఫోన్‌లో మాట్లాడటం వీడియోలో రికార్డ్ అయింది.

ఈ వీడియో వైరల్ అయింది. సహర్స ఎస్పీ లిపి సింగ్ వరకూ వెళ్లింది. దీంతో సీనియర్ పోలీసు అధికారి శశిభూషణ్ సిన్హాను వెంటనే సస్పెండ్ చేశారు. ఆ ఘటనపై దర్యాప్తునూ ఎస్పీ లిపి సింగ్ ఆదేశించారు.