స్టేషన్‌లో పనులు పక్కనబెట్టి సాధ్వీతో ఆశీర్వచనాలు.. పోలీస్ అధికారిపై వేటు

Police Officer Transfered Photo Of 'Healing' Session With Godwoman in delhi
Highlights

ఓ పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్‌లో కేటుగాళ్ల అంతు చూడకుండా సాధ్వీతో ఆశీర్వచనాలు తీయించుకోవడంతో అతనిపై వేటు పడింది. ఢిల్లీలోని జానక్‌పురి పోలీస్ స్టేషన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేస్తుండేవారు

ఓ పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్‌లో కేటుగాళ్ల అంతు చూడకుండా సాధ్వీతో ఆశీర్వచనాలు తీయించుకోవడంతో అతనిపై వేటు పడింది. ఢిల్లీలోని జానక్‌పురి పోలీస్ స్టేషన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేస్తుండేవారు. ఒక రోజు ఆయన స్టేషన్‌కు తనను తాను భగవంతుడిగా ప్రకటించుకున్న  సాధ్వీ నమిత ఆచార్య వచ్చారు. ఆమె వచ్చిన వెంటనే సిబ్బందితో పాటు తను సపర్యలు చేశారు. అనంతరం కళ్లు మూసుకుని కూర్చొన్న ఇంద్రపాల్ వెనుక నమిత నిలబడి తలపై చేతులు ఉంచి ఆశీర్వదించారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటో చక్కర్లు కొట్టడంత.. స్టేషన్‌లో పనిని వదిలేసి ఈ  పనులేంటీ అంటూ కామెంట్లు చేశారు. దీనిపై నమిత ఆచార్య మాట్లాడుతూ.. ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని.. అందువల్లే తాను ‘‘ఎనర్జీ హీలింగ్’’ కోసం ఈ ఫోటో తీయించుకున్నట్లు చెప్పారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఇంద్రపాల్‌ను ప్రాధాన్యం లేని పోస్ట్‌కు బదిలీ చేశారు.

కాగా, గతేడాది సాధ్వీ రాధేమా సేవలో  తరించిన పలువురు పోలీసులపైనా వేటు పడింది. రాధేమా ఓ పోలీస్ అధికారి కుర్చీలో కూర్చొని ఉండటంతో పాటు పోలీసులు పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేసిన వీడియో చక్కర్లు కొట్టడంతో పోలీస్ శాఖ  సీరియస్ అయ్యింది.. వీరిలో కొందరినీ సస్పెండ్ చేయడంతో పాటు బదిలీ చేసింది.

loader