మరోవైపు ఈ హత్యలపై గ్రామస్తులు కూడా స్పష్టంగా స్పందించకపోవడంతో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బొండూ గ్రామంలో నివసించే గోమీ కెరాయ్, అతని భార్య హత్యకు గురైనట్లు గ్రామస్థుల నుంచి పోలీసు సూపరింటెండెంట్ కు సమాచారం అందింది.
జార్ఖండ్ : Jharkhandలోని పశ్చిమ సింగ్ భూమ్ సమీప అడవిలో సగానికి కాలిపోయిన wife and husband మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం Superstition కారణంగా ఈ Twin murders జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంచనల కేసు జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత టొంటో పోలీస్స్టేషన్ పరిధిలోని బొండు గ్రామంలో చోటుచేసుకుంది.
మరోవైపు ఈ హత్యలపై గ్రామస్తులు కూడా స్పష్టంగా స్పందించకపోవడంతో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బొండూ గ్రామంలో నివసించే గోమీ కెరాయ్, అతని భార్య హత్యకు గురైనట్లు గ్రామస్థుల నుంచి పోలీసు సూపరింటెండెంట్ కు సమాచారం అందింది.
ఎస్పీ అజయ్ లిండా ఆధ్వర్యంలో ఎస్ డీపీఓ జగన్నాథ్ ఇకుర డంగ్ డుంగ్, ఎస్‌డీపీఓ కిరిబూరు అజిత్ కుమార్ కుజూర్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆదివారం (జనవరి 30) అడవిలో సోదాలు నిర్వహించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ జంట హత్యల కేసులో పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభించారు. ఇంత పెద్ద నేరం ఎవరు చేశారు అనేది ఇంకా తెలియరాలేదు.
గ్రామ ప్రజలు ఘటనపై సమాచారం అందించేందుకు సిద్ధంగా లేరు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని హంతకులు గ్రామస్తులను బెదిరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఘటనపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ కారణంగానే పోలీసులకు సమాచారం అందడంలో జాప్యం జరిగిందని, నిజానికి జనవరి 20న హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో మృతుడి సోదరుడు, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఎస్డిపివో కిరిబూరు అజిత్ కుమార్ కుజూర్ తెలిపారు. మూఢనమ్మకాలు, మద్యపానం ఈ సంఘటనలకు దారితీసింది అని, స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు అని మీడియాకు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని జగిత్యాలలో నిరుడు ఆగస్టులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికిస్తామంటూ దంపతులు ముందుకు... రావడం మృతుని కుటుంబ సభ్యులు వారి మాటలు నమ్మడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్షుద్ర పూజలు చేస్తే చనిపోయిన వ్యక్తి బతుకుతాడని, ఇందుకు పోలీసులు అడ్డుకోవడం తగదని ఆగ్రహిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది.
పోలీసుల కథనం ప్రకారం... జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామానగర్ కు చెందిన ఒర్సు రమేష్, అనిత భార్య భర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు. చనిపోవడానికి 15 రోజుల క్రితం వారు తమ ఇంటి సమీపంలోని కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులతో గొడవ పడ్డారు. అంతు చూస్తానంటూ ఆ సమయంలో పుల్లేశ్.. రమేష్ ను బెదిరించాడు. కొద్దిరోజుల తర్వాత రమేశ్ ఇంట్లో దుర్గమ్మ పండగ చేసుకున్నారు. మరుసటి రోజు రమేష్ పిలవకుండానే పుల్లేష్ అతని ఇంటికి భోజనం కోసం వెళ్ళాడు. అప్పటికి భోజనం అయిపోగా, కాసేపు ఆగితే వండిపెడతానని రమేష్ చెప్పాడు. అయితే పుల్లేశ్ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర చేతబడి చేయడంతోనే రమేష్ చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆ దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టారు. దెబ్బలు భరించలేక... తానే చేతబడి చేశానని... సగం చంపానని... క్షుద్ర పూజ చేసి బతికి ఇస్తాననినని రాజు చెప్పాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు పూజా సామాగ్రి తీసుకొచ్చారు. పూజ చేసేందుకు దంపతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజు, సుభద్రలను అదుపులోకి తీసుకున్నారు.
