ఒడిశా ఆరోగ్య మంత్రి నబాదాస్ పై కాల్పులు: పోలీసుల అదుపులో ఎఎస్ఐ గోపాల్ దాస్
ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబాదాస్ పై కాల్పులకు దిగింది ఎఎస్ఐ అధికారి గోపాల్ దాస్ గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.

భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబాదాస్ పై కాల్పులకు దిగింది ఎఎస్ఐ గోపాల్ దాస్ గా గుర్తించారు. మంత్రిపై కాల్పులకు దిగిన ఎఎస్ఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. మంత్రి నబాదాస్ శరీరంలో బుల్లెట్లు దూసుకు వెళ్లాయి.వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మంత్రి నబాదాస్ ను హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్ కు తరలించారు. భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య మంత్రి నబాదాస్ పై కాల్పుల ఘటనను క్రైంబ్రాంచ్ కి అప్పగించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరా తీశారు. మంత్రిపై రెండు రౌండ్లు ఎఎస్ఐ కాల్పులకు దిగాడు. మంత్రి చాతీలో బుల్లెట్లు ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.
also read:ఒడిశా ఆరోగ్య మంత్రిపై దుండగుల కాల్పులు: ఆసుపత్రికి తరలింపు
గాంధీ చక్ లో గోపాల్ దాస్ ఎఎస్ఐగా నియమించారు. ఎఎస్ఐ గోపాల్ దాస్ తన రివాల్వర్ నుండి మంత్రి నబాదాస్ పై కాల్పులు జరిపారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. మంత్రిపై కాల్పులకు ఎఎస్ఐ గోపాల్ దాస్ ఎందుకు దిగాడో సమాచారం లేదని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెబుతున్నారు. కాల్పులకు పాల్పడిన ఎఎస్ఐని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రిపై ఎఎస్ఐ కాల్పులకు దిగాడు. మంత్రిపై ఎఎస్ఐ కాల్పులకు దిగిన ఘటనతో బీజేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.దీంతో కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.