బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. భక్తియార్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో భద్రతా సిబ్బందిని తోసేసి సీఎంపై ఓ యువకుడు దాడి చేశాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి (bihar cm) నితీశ్ కుమార్‌పై (nitish kumar) దాడి జరిగింది. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో (bakhtiyarpur) సీఎం నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి ముఖ్యమంత్రిపూ దాడి చేశాడు ఆ యువకుడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
