వధువుతోపాటు ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉన్నాయి. దీంతో వధువుపై ఫిర్యాదు చేసేందుకు వరుడు కోలార్ రోడ్ పోలీసుస్టేషనుకు వచ్చాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ యువతి ఏకంగా ఐదుగురు యువకులను మోసం చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హర్దా జిల్లాకు చెందిన ఓ వరుడు పెళ్లి ముహూర్తం రోజు తన బంధుమిత్రులతో కలిసి వివాహ వేదిక వద్దకు తరలివచ్చాడు.వివాహ మండపానికి తాళం వేసి ఉండటం చూసిన వరుడు షాక్ కు గురయ్యాడు. వధువుతోపాటు ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉన్నాయి. దీంతో వధువుపై ఫిర్యాదు చేసేందుకు వరుడు కోలార్ రోడ్ పోలీసుస్టేషనుకు వచ్చాడు.
అక్కడ మరో నలుగురు వరులు అదే వధువు మోసం చేసిందంటూ ఫిర్యాదు చేసేందుకు బారులు తీరి ఉండటం చూసి వరుడు మరోసారి దిగ్ర్భాంతి చెందాడు. వధువుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులున్న ముఠాపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి భూపేందర్ సింగ్ చెప్పారు.
వధువును చూపించి పెళ్లి ఖరారు చేసి వరుడి నుంచి 20వేల రూపాయలు తీసుకొని వారు పరారవటం ఈ ముఠా వ్యూహమని పోలీసులు చెప్పారు. ఐదుగురు వరులను మోసగించి వధువుతో సహా, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశామని భోపాల్ పోలీసులు చెప్పారు.
