శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతున్న ఈ కాలంలోనూ ఆడదానికి రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికీ ఆడదాన్ని అంగడి సరుకులా చూస్తున్నవారు మన సమాజంలో ఉన్నారు. ఆడపిల్లకు ఇంటి బయటే కాదు.. కనీసం ఇంట్లోనూ రక్షణ లేకుండా పోతోంది. కొన్నిచోట్ల కన్న తండ్రులే కామాంధుల్లా ప్రవర్తిస్తుంటే... అత్తారింట్లో మామ కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా కన్యత్వ పరీక్ష పేరిట ఓ మామ కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను చేసిన ఘనకార్యానికి కట్టుకున్న మొగుడు, తల్లి లాంటి అత్త కూడా వంత పాడటం గమనార్హం. ఈ దారుణ సంఘటన ఇటార్సీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటార్సీ ప్రాంతానికి చెందిన కమల అనే యువతికి ఇటీవల అదే ప్రాంతానికి చెందిన రాజా అనే వ్యక్తితో ఇటీవల వివాహమైంది. కోటి ఆశ‌ల‌తో అత్త ఇంట్లో అడుగు పెట్టిన క‌మ‌ల‌కు ఊహించ‌ని షాకులు త‌గిలాయి.

క‌మ‌ల ఇంట్లో అడుగు పెట్ట‌గానే... ఆమెను బాత్‌రూంలోకి పిలిచిన అత్త...  బట్టలు విప్పమని ఆదేశించింది. దీంతో షాకైన ఆమె ఎందుకుని అడిగింది. ‘నువ్వు కన్నెపిల్లవో కాదో తెలియాలి కదా’ అత్త చెప్పడంలో కోడలు నిర్ఘాంతపోయింది. ఇక నగ్నంగా ఉన్న కోడలి శరీర భాగాలను తడిమింది. దీంతో క‌మ‌లకు చిరెత్తుకొచ్చింది. కానీ, ఏమి చేయ‌లేని ప‌రిస్థితి. అయితే ఇదే విషయాన్ని భర్తకు చెప్పగా... ‘మా అమ్మ మాటకు ఎదురుచెప్పకుండా, నువ్వు కన్నెపిల్ల అని నిరూపించుకో’ అంటూ తల్లికి వంత పాడాడు.

ఇక ఆ త‌ర్వాతి రోజు కోడ‌లికి మామ గ‌ది శుభ్రం చేయ‌మ‌ని పంప‌గా... లోప‌లే ఉన్న మామ తలుపులు మూసివేసి ఆమెపై పశువులా మీద పడి అత్యాచారం చేశాడు. అనంత‌రం క‌మ‌ల ఈ దారుణాన్ని అత్తకు చెప్ప‌గా... ‘నువ్వు కన్య వా ? కాదా ? అని తెలుసుకునేందుకు మీ మామగారు పరీక్ష చేశారు. ఇది మా ఆచారం’అని చెప్పుకొచ్చింది. దీంతో షాక్ అయిన క‌మ‌ల పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. వెంట‌నే స్పందించిన పోలీసులు అత్త, భ‌ర్త‌, మామ‌పై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.