కర్ణాటక రాష్ట్రంలోకి 19మంది ఉగ్రవాదులు ప్రవేశించారంటూ.. ఓ మాజీ ఆర్మీ అధికారి.. పోలీసులకు ఫేక్ కాల్ చేశాడు. ఫేక్ కాల్ చేసినందుకు గాను.. ఆ మాజీ ఆర్మీ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బెంగళూరుకు చెందిన స్వామి సుందర మూర్తి(65) ఆర్మీ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  కాగా.. కర్ణాటకలోని 19మంది టెర్రరిస్టులు ప్రవేశించారంటూ ఆయన పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. నిజమని నమ్మిన పోలీసులు సోదాలు చేపట్టగా.. ఫేక్ అని తేలింది.

దీంతో.. తప్పుడు సమాచారం అందించినందుకుగాను సుందర మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. సుందరమూర్తి కుమారుడు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. కాగా కార్గిల్ యుద్ధంలో  ఆయన అమరుడయ్యాడు.

ఇదిలా ఉండగా.. ఫేక్ కాల్ ఎందుకు చేశారంటూ పోలీసులు ఆయనను నిలదీశారు. అయితే.. శ్రీలంకలో ఉగ్రదాడి అనంతరం కర్ణాటకలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తనకు అనిపించిందని..  అందుకే చెప్పానని ఆయన చెప్పడం గమనార్హం.