ఓ ఇంట్లో దొంగతనం జరిగితే ఆ కేసు చేధించడానికి వెళ్లిన పోలీసులకు మరో కేసు దొరికింది. దొంగతనం కేసు విచారణలో.. ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని తెలిసి పోలీసులు షాకయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నైలోని రెడ్‌హిల్స్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్‌ రెండవ భార్య రతి (42) ఉండే ఇంట్లోకి ఈ నెల 5వ తేది రాత్రి ఐదు మోటార్‌సైకిల్‌ వాహనాల్లో వచ్చిన ఓ ముఠా ప్రవేశించింది. రతి, ఆమె కుటుంబసభ్యులను బెదిరించి వారిని కట్టివేసి,  14 సవర్ల నగదు, రూ.10 వేలు చోరీ చేసి పరారయ్యారు. 

బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చేపట్టిన విచారణలో, వారు మీంజూరు, మాత్తూరు ప్రాంతాలకు చెందిన వారని గుర్తించి వారిని అరెస్ట్‌ చేసి విచారించగా, రతి తన ఇంట్లో కొందరు యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తుందని పేర్కొన్నారు. దీంతో, రతిపై కూడా కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.