Asianet News TeluguAsianet News Telugu

370 మంది మహిళలకు వీడియో కాల్స్ చేసి..!

అతనికి మహిళలను లైంగికంగా వేధించడం చాలా సరదా. అందుకోసం దాదాపు 7 స్మార్ట్ ఫోన్లు వాడేవాడు. ప్రతి ఫోన్ లో కొత్త నెంబర్ వాడేవాడు. 

police arrest the men who molested woman on whatsapp
Author
Hyderabad, First Published Jun 25, 2021, 2:36 PM IST

టెక్నాలజీని చాలా మంది మంచికి ఉపయోగించుకుంటుంటే.. మరికొందరు మాత్రం అదే టెక్నాలజీతో చెడు పనులు చేయడానికి రెడీగా ఉంటున్నారు. తాజాగా.. ఓ యువకుడు.. దాదాపు 370 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. వాట్సాప్ లో వీడియో కాల్స్ చేస్తూ.. వారికి నరకం చూపించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బల్లియా జిల్లాకు చెందిన 35ఏళ్ల శివ కుమార్ వర్మ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. అతనికి మహిళలను లైంగికంగా వేధించడం చాలా సరదా. అందుకోసం దాదాపు 7 స్మార్ట్ ఫోన్లు వాడేవాడు. ప్రతి ఫోన్ లో కొత్త నెంబర్ వాడేవాడు. తర్వాత వాట్సాప్ నుంచి మహిళలకు ఫోన్లుచేసి వేధించేవాడు.

అనంతరం ఆ సిమ్‌ను నాశనం చేసేవాడు. సెల్‌ ఫోన్‌ కీ ప్యాడ్‌పై ఇష్టం వచ్చినట్లు ఓ పది నెంబర్లు టైపు చేసేవాడు. ఆ నెంబర్‌ను ట్రూ కాలర్‌లో చెక్‌ చేసుకునేవాడు. అది ఆడవారి నెంబర్‌ అయితే ఆ పేరుతో సేవ్‌ చేసుకునేవాడు. అనంతరం వారికి వాట్సాప్‌ కాల్‌ చేసేవాడు. వాట్సాప్‌ కాల్‌ను.. వీడియో స్క్రీన్‌ రికార్డు మోడ్‌లో ఉంచి, దుస్తులు విప్పేవాడు. ఇది గుర్తించిన మహిళలు కాల్‌ కట్‌ చేసేవాళ్లు. ఇలా కాల్‌ కట్‌ చేసిన వాళ్లను మళ్లీ వేధించేవాడు.


పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే తన వద్ద ఉన్న స్క్రీన్‌ రికార్డింగులను భర్తకు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి భయపడేవారు. కొంతమంది నెంబర్లు మార్చేసేవారు.  ఫిబ్రవరి 2020లో లక్నోకు చెందిన ఓ మహిళ వర్మకు వ్యతిరేకంగా 1090 నెంబర్‌కు ఫోన్‌ చేసింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని పలుమార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ తన పాత పంథానే కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, అరెస్ట్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios