Asianet News TeluguAsianet News Telugu

థియేటర్ లో బాంబు ఉందంటూ నకిలీ ట్వీట్.. చివరకు...

ఆ సినిమా థియేటర్‌లో అనువనువు గాలించగా ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఇది ఫేక్‌ సందేశమని నిర్ధరణకు వచ్చారు. కానీ, ఈ సందేశం పోలీసులు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

police arrest the man who tweeted fake tweet in mumbai
Author
Hyderabad, First Published Feb 10, 2021, 9:49 AM IST

సినిమా థియేటర్ లో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి సరదాగా నకిలీ ట్వీట్ చేశాడు. చివరకు ముంబయి సైబర్ క్రైం పోలీసులకు చిక్కి.. జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి చివరి వారంలో ‘మేడం చీఫ్‌ మినిస్టర్‌’ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్‌లో బాంబు పేలుస్తామని బన్వారి సింగ్‌ ట్వీట్‌ చేశాడు. అందుకు బన్వారీ కమాండో సింగ్‌ పేరుతో ట్విటర్‌లో అకౌంట్‌ తెరిచాడు. అదే పేరుతో బాంబు పేలుస్తామనే సందేశాన్ని పోస్టు చేయడంతో ముంబై సైబర్‌ క్రైం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

వెంటనే ఆ సినిమా థియేటర్‌లో అనువనువు గాలించగా ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఇది ఫేక్‌ సందేశమని నిర్ధరణకు వచ్చారు. కానీ, ఈ సందేశం పోలీసులు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ సందేశం హరియాణా నుంచి కమాండో సింగ్‌ పేరుతో బన్వారి ట్విట్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. బన్వారీపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios