ఆమెకు పెళ్లైంది. భర్త కూడా ఉన్నాడు. కానీ.. ఆమె భర్తని కాదని మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. భర్తని వదిలేసి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో.. తన భార్యను తనకు కాకుండా చేసిన వ్యక్తిపై పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనిని కిడ్నాప్ చేసి అనంతరం అతి కిరాతకంగా హత్య చేసి.. చివరకు రక్తం కూడా తాగేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకకు చెందిన తబ్రేజ్ కి అందమైన భార్య ఉంది. ఇద్దరూ ఆనందంగా ఉండేవారు. వీరి మధ్యలోకి సుభాన్ అనే మరో వ్యక్తి ప్రవేశించాడు. తబ్రేజ్ భార్యకు ఎరవేసి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా ఆమె తో కలిసి లేచిపోయాడు. తబ్రేజ్ భార్యతో వేరే ఊరికి వెళ్లి అక్కడ సుభాన్ సంసారం చేయడం మొదలుపెట్టాడు.

దీంతో సుభాన్‌ను ఎలాగైనా తొలగించుకోవాలని నిర్ణయించాడు తబ్రేజ్‌. మే నెలలో తన స్నేహితులతో కలిసి తుమకూరులోని సుభాన్‌ అపహరించి బెంగళూరుకు తీసుకొచ్చారు. చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి డీజేహళ్లి పోలీసుస్టేషన్‌ వద్ద పడేశారు.

మొదట పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తబ్రేజ్‌ భార్యను అదుపులోకి తీసుకొని విచారించారు. తబ్రేజ్‌తో కలిసి ఉండలేనని ఆమె పోలీసుల ముందు చేప్పేసింది. తను సుభాన్‌తో కలిసి ఉండడం వల్ల తబ్రేజ్‌ హత్య చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు తబ్రేజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

తన స్నేహితులతో కలిసి సుభాన్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు తబ్రేజ్‌ పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. తన భార్య తీసుకేళ్లిన సుభాన్‌ను హత్య చేయటమేకాదు.  అతడి రక్తం కూడా తాగినట్లు తబ్రేజ్‌  వెల్లడించాడు. దీనితో పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. తబ్రేజ్‌తో పాటు అతనికి సహరించిన స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.