Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ లో పిల్లల అశ్లీల వీడియోలు ..41మంది అరెస్ట్

ఈ నేపథ్యంలో కేరళ అంతటా 46 చోట్ల దాడులు నిర్వహించి 339 కేసులు నమోదు చేశారు. వాట్సాప్ లో పిల్లల అశ్లీల చిత్రాలను పంచుకున్నారనే ఆరోపణలతో ఆషికీ(30) అనే యువకుడిని త్రిస్సూర్ పోలీసులు మొదట అదుపులోకి తీసుకున్నారు.

police arrest 41 people who encouraging child pornography in Kerala
Author
Hyderabad, First Published Dec 29, 2020, 7:32 AM IST

పిల్లల అశ్లీల వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి.. అనంతరం వాటిని ఆన్ లైన్ లో షేర్ చేశారు. కాగా..  ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కారణంతో.. డాక్టర్, ఐటీ నిపుణుడు సహా మొత్తం 41 మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఇటీవల  పిల్లలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సైబర్ సెల్ నిఘాను కట్టుదిట్టం చేసింది.

దీనిలో భాగంగా ఆపరేషన్ పీ హింట్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో కేరళ అంతటా 46 చోట్ల దాడులు నిర్వహించి 339 కేసులు నమోదు చేశారు. వాట్సాప్ లో పిల్లల అశ్లీల చిత్రాలను పంచుకున్నారనే ఆరోపణలతో ఆషికీ(30) అనే యువకుడిని త్రిస్సూర్ పోలీసులు మొదట అదుపులోకి తీసుకున్నారు.

అతను ఇచ్చిన సమాచారంతోనే అదే జిల్లాలోని వడక్కెకాడ్ కు చెందిన ఇక్బాల్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వీరితోపాటు పత్తనంథిట్టం జిల్లాకు చెందిన ఓ వైద్యుడు, త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఐటీ నిపుణుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వాట్సాప్ గ్రూప్ లు, ఇతర ఆన్ లైన్ నెట్ వర్క్ ల సాయంతో చిన్నారుల అశ్లీల చిత్రాలను ప్రసారం చేయడం, షేర్ చేయడం, సేవ్ చేయడం లాంటివి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. 

కాగా.. గత రెండేళ్లలో నిర్వహించిన దాడుల్లో 525 కేసులు నమోదు చేయడంతోపాటు 428 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర అదనపు డీజీపీ మనోజ్ అబ్రహం తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios