Asianet News TeluguAsianet News Telugu

మద్యపానంపై నిషేధమున్న బిహార్‌లో పోలీసు స్టేషన్‌లో లిక్కర్ పార్టీ.. ఖైదీలు, అధికారులు కలిసే..!

బిహార్‌లో మద్యపానంపై నిషేధం  అమలవుతున్నది. అలాంటి రాష్ట్రంలో ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే లిక్కర్ పార్టీ జరిగింది. అదీ ఇద్దరు పోలీసు అధికారులు.. ఖైదీలతో కలిసి చేసుకున్న పార్టీ కావడం గమనార్హం.
 

police and prisoners liquor party in police station in dry state bihar
Author
First Published Dec 2, 2022, 2:19 PM IST

పాట్నా: బిహార్ డ్రై స్టేట్. అక్కడ మద్యపానంపై నిషేధం ఉన్నది. పౌరులు ఎవరు మద్యపానం విక్రయించినా, కొనుగోలు చేసినా, సేవించినా నేరమే. కానీ, నిబంధనను అమలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులే కంచె మేసిన చందంగా లిక్కర్ పార్టీలో పట్టుబడ్డారు. అదీ పోలీసు స్టేషన్‌లో ఖదీలతో కలిసి లిక్కర్ తాగుతూ దొరికారు. ఈ కేసులో ఐదుగురు ఖైదీలు, ఇద్దరు పోలీసు అధికారులు కలిపి మొత్తం ఏడుగురు నిందుతులను పోలీసులు అరెస్టు చేశారు. పాట్నా సమీపంలోని పాలిగంజ్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.

ఈ లిక్కర్ పార్టీకి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ విషయం ఉన్నతాధికారులకు చేరింది. వెంటనే వారు స్పాట్‌కు వెళ్లి పట్టుకున్నారు. ఈ వీడియోను ఓ ఖైదీ రికార్డు చేసి తన కాంటాక్టులో ఉన్నవారందరికీ పంపించాడు. అందులో ఓ పోలీసు అధికారి నెంబర్ కూడా ఉన్నది. దీంతో.. పార్టీ చేసుకున్నప్పుడే వీడియో తీసి డైరెక్ట్‌గా పోలీసుకే సమాచారం ఇచ్చినట్టయింది.

లాకప్‌కు మద్యం ఎలా సప్లై అయిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖైదీలకు ఉన్న సంబంధాలతో లిక్కర్‌ సరఫరా అయినట్టు అనుమానిస్తున్నారు. వారి కనెక్షన్‌ల ద్వారా అధికారులు ఆ లిక్కర్ తెప్పించుకుని ఉంటారని భావిస్తున్నారు.

లాకప్‌లో ఉన్న ఓ ఖైదీ తీసిన వీడియో అతని కాంటాక్టు లిస్టులో ఉన్న పాలిగంజ్ ఏఎస్పీ అవదేశ్ దీక్షిత్‌కు చేరింది. వీడియో రిసీవ్ చేసుకున్న తర్వాత పాలిగంజ్ పోలీసులు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పై రైడ్ చేశారు. వారి లిక్కర్ పార్టీకి ఎండ్ కార్డ్ వేశారు. ఆ లాకప్ బయటి నుంచి తాళం వేసి ఉండటం గమనార్హం. 

పాలిగంజ్ ఎస్‌డీపీవో మాట్లాడుతూ, ఈ పార్టీ గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే తాము పరిశీలించడానికి అక్కడికి వెళ్లామని తెలిపారు. అక్కడ కొందరు ఆల్కహాల్ తాగుతూ పట్టుబడ్డారని అన్నారు. వారంతా ఖైదీలే అని చెప్పారు. వారికి ఆల్కహాల్, ఇతర వస్తువులు ఎలా అందుబాటులోకి వచ్చాయనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


పోలీసు సమగ్ర నివేదికను పంపిస్తామని, మంగళవారం, బుధవారం రాత్రి పోలీసు స్టేషన్ నుంచి కనిపించకుండా పోయిన కానిస్టేబుళ్లపై యాక్షన్ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు రిక్వెస్ట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios