Asianet News TeluguAsianet News Telugu

Rahul Gandhi: ప్రధాని 'గబ్బర్ సింగ్ ట్యాక్' .. ఇప్పుడు 'గ్రహస్తి సర్వనాష్ ట్యాక్స్'గా మారుతోంది: రాహుల్

Rahul Gandhi on GST:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హోటల్ వసతి, ప్రీ-ప్యాక్డ్ ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను(GST) వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

PMs Gabbar Singh Tax is now turning into Grahasti Sarvnaash Tax: Rahul
Author
Hyderabad, First Published Jun 30, 2022, 5:07 AM IST

Rahul Gandhi on GST: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆహార పదార్థాల నుంచి హోటల్ బస వరకు అన్నింటిపైనా పన్నులు పెంచడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి ‘గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్(Gabbar Singh Tax)’గా ఉన్న జీఎస్‌టీ.. ఇప్పుడు  'గృహస్తి సర్వనాష్ ట్యాక్స్ (Grahasti Sarvnaash Tax)గా  మారబోతోందని ఆయన ఆరోపించారు.

దేశంలో తగ్గుతోన్న ఉపాధి, ఆదాయ మార్గాలు.. ద్రవ్యోల్బణం పెరుగుద‌ల‌పై ప్రభావం చూపుతున్నాయ‌నీ, ప్రధానమంత్రి 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' ఇప్పుడు గృహస్తి సర్వనాష్ ట్యాక్స్ 'గా బలీయమైన రూపాన్ని సంతరించుకుంది' అని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

ఆహార పదార్థాలు, విద్య, హోటల్‌ వసతిపై పన్నులు ఖరీదైనవిగా మారాయని ఉదహరించారు.  గతంలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా  రాహుల్ గాంఅభివర్ణించారు. ఆహార ఉత్పత్తులు, విద్య, హోటల్‌ వసతి వంటివి ఇక మరింత ప్రియం కాబోతున్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్‌టీ మండలి ఇటీవల సమావేశమైంది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులకు జీఎస్‌టీ మండలి ఆమోదం తెలిపింది.

ఇదిలా ఉంటే..  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో  అన్ని రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో స‌మావేశ‌మ‌య్యారు.  ప్రస్తుతం ప్యాక్ చేయబడిన, లేబుల్ వేయబడిన ఆహార పదార్థాల‌ను GST  స్లాబ్ లోకి  సమీక్షించాలన్న GoM సిఫార్సును ఆమోదించింది. 

దీని కింద ముందు.. ప్యాక్ చేసి లేబుల్ చేసిన మాంసం, చేపలు, పెరుగు, జున్ను, తేనె, ఎండు పప్పులు, ఎండిన మఖానా, గోధుమలు మరియు ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, బెల్లం, ముర్మురా (మురి),  ఇత‌ర వస్తువులు, సేంద్రియ ఎరువులు,  కొబ్బరి పిత్ కంపోస్ట్ ఉన్నాయి. GST నుండి మినహాయింపు ఉండదు. ఇప్పుడు వాటిపై ఐదు శాతం పన్ను విధించబడుతుంది.

అదేవిధంగా, బ్యాంకులు జారీ చేసే..  చెక్కులపై 18 శాతం GST విధించబడుతుంది. అట్లాస్‌తో సహా మ్యాప్‌లు, చార్ట్‌ల‌పై 12 శాతం GST,  ప్యాక్ చేయని, లేబుల్ లేని మరియు బ్రాండ్ లేని వస్తువులకు GST నుండి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా రోజుకు రూ.1000లోపు ధర ఉన్న హోటల్ గదులపై 12 శాతం GST ని  విధించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios