విద్యా రంగానికి పెద్ద పీట వేయనున్న ప్రధాని..

ఫిబ్రవరి 20వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ జమ్మూ పర్యటన ఉంది. ఇందులో భాగంగా అనేక విద్యాసంస్థలను జాతికి అంకితం చేయనున్నారు. 

PM will give a major boost to the education sector tomorrow - bsb

జమ్మూ కశ్మీర్ : విద్య, నైపుణ్యం మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం, అభివృద్ధి చేయడంలాంటి కార్యక్రమాల్లో కీలకమైన అడుగుగా ప్రధాని మోదీ విద్యారంగానికి పెద్ద పీట వేయనున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం నాడు ప్రధాన మంత్రి సుమారు రూ. 13,375 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 

జాతికి అంకితం చేయబడిన ఈ ప్రాజెక్టులలో ఐఐటీ భిలాయ్, ఐఐటీ తిరుపతి, ఐఐటీ జమ్మూ, ఐఐఐటీడీఎం కాంచీపురం పర్మినెంట్ క్యాంపస్ లు ఉన్నాయి ఉన్నాయి.

ఇంకా.. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (IIS) - అధునాతన సాంకేతికతలపై మార్గదర్శక నైపుణ్య శిక్షణా సంస్థ, దేవప్రయాగ్ (ఉత్తరాఖండ్), అగర్తల (త్రిపుర)లలో ఉన్న సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. 

ఇప్పుడు సుదాముడు శ్రీకృష్ణుడికి అన్నం పెడితే.. ఏదో అవినీతి చేశాడనేవారు - ప్రధాని నరేంద్ర మోడీ

దేశంలో ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధ్‌గయా, ఐఐఎం విశాఖపట్నం అనే మూడు కొత్త ఐఐఎంలను ప్రధాని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ (కెవిలు) కోసం 20 కొత్త భవనాలు, 13 కొత్త నవోదయ విద్యాలయాలు (ఎన్‌వి) భవనాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. 

ఐదు కేంద్రీయ విద్యాలయ క్యాంపస్‌లు, ఒక నవోదయ విద్యాలయ క్యాంపస్, దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల కోసం ఐదు మల్టీపర్పస్ హాల్‌లకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూలో జరిగే పర్యటనలో వీటిని జాతికి అంకితం చేయనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios