ప్రధాని నరేంద్రమోదీ.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఇంటర్వ్యూలో అక్షయ్ ని, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నాని ఉద్దేశించి మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

‘‘ మీ భార్య నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది కదా’’ అంటూ మోదీ.. అక్షయ్ కుమార్ తో అనడం గమనార్హం. ‘‘ నేను మిమ్మల్ని( అక్షయ్),ట్వింకిల్ గారినీ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటాను. ఆమె నన్ను ఎలా టార్గెట్ చేస్తుందా అన్నవిషయాలను గమనిస్తూ ఉంటాను. ఇంట్లో ఆమె తన కోపాన్నంతా నా మీద చూపిస్తారు కాబట్టి..మీరు ప్రశాంతంగా ఉంటారు కదా’’ అంటూ.. మోదీ అక్షయ్ ని అడిగారు. దానికి అక్షయ్ సమాధానంగా పగలబడి నవ్వేశారు.

అయితే.. ఇంటర్వ్యూ అనంతరం వీడియో వైరల్ గా మారడంతో.. దీనికి ట్వింకిల్ ఖన్నా... ట్విట్టర్ వేదికగా  స్పందించారు. మోదీ కామెంట్స్ ని తాను పాజిటివ్ గా తీసుకుంటానని ఆమె చెప్పడం గమనార్హం. ప్రధాని అయి ఉండి.. ఆయన నన్ను గమనించడం.. నా పనిని గుర్తించడం గొప్ప విషయమే కదా.. అని ట్వింకిల్ పేర్కొన్నారు.