న్యూఢిల్లీ: హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  మహారాష్ట్రప్రజలు మళ్లీ ఎన్డీఏకు పట్టంకట్టడం సంతోషంగా ఉందన్నారు. మళ్లీ అక్కడి ప్రజల మద్దతు చూరగొనడం గౌరవంగా భావిస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. 

మహారాష్ట్ర అభివృద్ధిలో పురోగతి కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ, శివసేనకు చెందిన ప్రతీ కార్యాకర్తకు సెల్యూట్ చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. 

అలాగే హరియాణా ప్రజలకు సైంత మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీని గెలిపించినందుకు సంతోషంగా ఉందన్నారు. రెట్టింపు ఉత్సాహం, అంకిత భావంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. 

ఇకపోతే దేశప్రజలకు తమకు దీపావళి సంబరాలు ముందుగానే ఇచ్చేశారని చెప్పుకొచ్చారు. దీపావళి కంటే ముందే హరియాణా, మహారాష్ట్రలో బీజేపీ గెలుపొందడం తమకు ముందే దీపావళి వచ్చినంత ఉత్సాహంగా ఉందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. 

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి 159 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 103 చోట్ల విజయకేతనం ఎగురవేయగా శివసేన 56 చోట్ల గెలుపొందింది. ఇకపోతే కాంగ్రెస్ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 46 స్థానాల్లో విజయం సాధించగా ఎన్సీపీ 53 చోట్లు గెలుపొందింది. ఇక ఇతరులు 30 చోట్లు గెలుపొందిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే హరియానా ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయి. గతంతో పోల్చుకుంటే చాలా సీట్లు తగ్గాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 40స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ 31, జేజేపీ10, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

అయితే హరియాణాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే అంశం జేజేపీ చేతుల్లో ఉంది. ప్రస్తుతానికి హరియాణా ఎన్నికల్లో జేజేపి కింగ్ మేకర్ గా మారింది. 

ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో విజయం సాధించకపోయినప్పటికీ బీజేపీ-శివసేన కూటమికి మంచి అధికారాన్ని కట్టబెట్టడంలో పరోక్షంగా సహకరించినట్లైంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం ఓటర్లను చీల్చడంతోపాటు కంచుకోటలను కూడా బద్ధలకొట్టి కోలుకోలేని దెబ్బతీసింది ఎంఐఎం పార్టీ.  

ఎంఐఎం పార్టీ విస్తృతంగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పార్టీ గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. వాస్తవానికి చెప్పాలంటే ఎన్సీపీకి కంటే తక్కువ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందది.  
 

ఈ వార్తలు కూడా చదవండి

కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ఎవరంటే
ఉప ఎన్నికలు.. తప్పిన హుజూర్ నగర్, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే విజయం