Asianet News TeluguAsianet News Telugu

114శాతం పెరిగిన ఆస్తులు: ప్రధాని మోదీ ఆస్తుల చిట్టా ఇదీ......

ఇకపోతే మోదీ ఆస్తుల విషయానికి వస్తే ఆస్తుల విలువ మొత్తం రూ 2.51 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. వీటిలో చరాస్తులు రూ 1.41 కోట్లు కాగా, స్ధిరాస్తులు రూ 1.10 కోట్లు. చరాస్తుల్లో అధిక​ భాగం ఎస్‌బీఐలో ఉన్నట్లు చూపించారు. రూ 1.27 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. 
 
pm narendramodi filed nomination from varanasi, his assets
Author
Varanasi, First Published Apr 26, 2019, 8:36 PM IST

ఢిల్లీ : వారణాసి లోక్ సభ అభ్యర్థి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులకు సంబంధించి అఫిడవిట్ ను రిటర్నిగ్ అధికారికి సమర్పించారు మోదీ. అయితే మోదీ ఆస్తులు 2014 నుంచి 2019 వరకు పరిశీలిస్తే ఏకంగా 52 శాతం పెరిగాయి. 

ఇకపోతే మోదీ ఆస్తుల విషయానికి వస్తే ఆస్తుల విలువ మొత్తం రూ 2.51 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. వీటిలో చరాస్తులు రూ 1.41 కోట్లు కాగా, స్ధిరాస్తులు రూ 1.10 కోట్లు. చరాస్తుల్లో అధిక​ భాగం ఎస్‌బీఐలో ఉన్నట్లు చూపించారు. రూ 1.27 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. 

మోదీ చరాస్తులు 2014తో పోలిస్తే 114 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2014లో ఆయన తన చరాస్తుల విలువ రూ 65.91 లక్షలు కాగా ఇప్పుడు 1.41 కోట్లుగా చూపారు. ప్రధాని ప్రధాన ఆదాయ వనరు వేతనం కాగా, పొదుపు ఖాతాపై వడ్డీల నుంచి ఆదాయం సమకూరుతోందని స్పష్టం చేశారు. 

ఇక కేసులు విషయానికి వస్తే తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు కానీ, ఆరోపణలు గానీ లేవన్నారు. అప్పులు అస్సల్లేవని అఫిడవిట్ లో స్పష్టం చేశారు. చరాస్తుల్లో రూ. 38,750 చేతిలో నగదు కాగా, బ్యాంకులో కేవలం రూ 4,143 బ్యాలెన్స్‌ ఉన్నట్టు చూపించారు. 

ఎస్‌బీఐలో రూ 1.27 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇక 2014లో చేతిలో నగదు రూ 32,700, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ 26.05 లక్షలు, రూ 32.48 లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో ప్రధాని నరేంద్రమోదీ చూపారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios