ప్రధాని నరేంద్రమోడీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న ఆయన పిన్ని నర్మదాబెన్ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు.  కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌లోని న్యూ రణిప్ ప్రాంతంలో ఆమె నివసిస్తున్నారు.

కరోనా వైరస్ సోకిన తమ పిన్నిని పది రోజుల క్రితం సివిల్ ఆసుపత్రిలో చేర్పించామని, పరిస్థితి విషమించడంతో నర్మద ఈ రోజు తుది శ్వాస విడిచారని మోడీ పెద్దన్నయ్య.. ప్రహ్లాద్ మోడీ తెలిపారు. ప్రధాని మోడీ తండ్రి దామోదర్‌దాస్ సోదరుడు జగ్జీవన్‌దాస్ భార్యే నర్మదాబెన్. కాగా, జగ్జీవన్ చాలా ఏళ్ల క్రితమే మృతి చెందినట్టు ప్రహ్లాద్ మోడీ తెలిపారు.