Asianet News TeluguAsianet News Telugu

గాల్వాన్‌ ఘటనపై కేంద్రం అఖిలపక్ష సమావేశం: దేశం మీవెంటేనన్న మమత

గాల్వాన్ ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది.  ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు

PM Narendra Modis All-Party Meeting completed On Ladakh Clash
Author
New Delhi, First Published Jun 19, 2020, 8:07 PM IST

గాల్వాన్ ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది.  ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఘర్షణలకు ముందు, తర్వాత పరిస్థితిని ఆయన వివిధ పార్టీల నేతలకు వివరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

టెలికాం, రైల్వే, విమానయాన రంగాల్లోకి చైనాను అనుమతించొద్దని టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. చైనీయులు ప్రవేశించడానికి తాము ఒప్పుకోమని ఆమె స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశం దేశానికి మంచి సందేశమని, మన జవాన్ల వెనుక మనమందరం ఉన్నామనే సంకేతం వెళ్తుందని మమత వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఉంటుందన్నారు.

చైనా ప్రజాస్వామ్య దేశం కాదని.. ఏదనుకుంటే అది చేస్తుందని, మనం కలిసి పనిచేస్తే ఇండియా గెలుస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఐక్యంగా ఆలోచించాలని... ఐక్యంగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios