ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) ఆధ్వర్యంలో తదుపరి విడతను 2020 డిసెంబర్ 25 న మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు.

తద్వారా రూ. 9 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు 18,000 కోట్లు జమకానున్నాయి. ఈ కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల రైతులతో ప్రధాని సంభాషించనున్నారు. రైతులు తమ అనుభవాలను పీఎం-కిసాన్‌తో పంచుకుంటారు.

అలాగే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపైనా తమ అభిప్రాయాలను తెలపనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొంటారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద మోదీ సర్కారు ఏటా రూ.6000 రూపాయలను దేశంలోని రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో రైతుల ఖాతాల్లో వేస్తోంది.