Asianet News TeluguAsianet News Telugu

Surat : ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ .. ఒకే చోట 4500 ఆఫీసులు, డిసెంబర్ 17న ప్రారంభించనున్న మోడీ

ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ‘‘సూరత్ డైమండ్ బోర్స్’’ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దాదాపు రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం డైమండ్ బిజినెస్‌కు డెస్టినేషన్‌గా మారనుంది.

PM narendra Modi To Inaugurate Surat Diamond Bourse - World`s Largest Corporate Office Hub ksp
Author
First Published Dec 16, 2023, 9:50 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ‘‘సూరత్ డైమండ్ బోర్స్’’ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దాదాపు రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం డైమండ్ బిజినెస్‌కు డెస్టినేషన్‌గా మారనుంది. ఇందులో 4500 కార్యాలయాలు వున్నాయి. ఈ డైమండ్ బోర్స్ .. పెంటగాన్‌లో వున్న భవనం కంటే పెద్దది. డైమండ్ కేపిటల్‌గా ప్రఖ్యాతి గాంచిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. ఇప్పుడు నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్‌ దాదాపు 65 వేల మంది వజ్రాల నిపుణులకు వేదికగా మారనుంది. అంతేకాదు.. దేశంలో డైమండ్ ట్రేడింగ్‌ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 

15 అంతస్తులతో, 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 4500 కార్యాలయాలు వున్నాయి. ఇది 9 దీర్ఘ చతురస్రాల ఆకారాలను కలిగి వుంటుంది. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల్లో వుంటుందని .. దీనిని నిర్మించడానికి 4 ఏళ్లు పట్టిందని తెలిపారు. అలాగే వజ్రాల నిపుణులు ప్రతి నిత్యం రైళ్లలో ముంబైకి వెళ్లకుండా ఈ భవనం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. 

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మోర్ఫోజెనిసిస్ సంస్థ ఈ భవనాన్ని నిర్మించింది. ఈ సంస్థ భారత్‌కు చెందినది కావడం విశేషం. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వున్న డైమండ్ సెంటర్ కంటే సూరత్‌లోని డైమండ్ బోర్స్ సెంటర్ పెద్దదని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌లో సేవలందిస్తున్న డైమండ్ సెంటర్‌లో కేవలం 1000 కార్యాలయాలే వున్నాయి . కానీ సూరత్ డైమండ్ బోర్స్‌లో ఏకంగా 4500 ఆఫీసులు వుండటం విశేషం. 

అలాగే దిగుమతి - ఎగుమతి కోసం బోర్స్‌లో అత్యాధునిక 'కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్' వుంది. రిటైల్ ఆభరణాల వ్యాపారం కోసం జ్యువెలరీ మాల్ , అంతర్జాతీయ బ్యాంకింగ్ , సేఫ్టీ వాల్ట్‌ల సౌకర్యం కూడా అందుబాటులో వుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios