మహారాష్ట్రలోని సంగోలా నుండి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ వరకు 100వ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
మహారాష్ట్రలోని సంగోలా నుండి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ వరకు 100వ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ కూడా పాల్గొంటారు.
ఈ మల్టీ-కమోడిటీ రైలు సర్వీసులో కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యాబేజీ, డ్రమ్ స్టిక్, మిరపకాయలు, ఉల్లిపాయ, ద్రాక్ష, నారింజ, దానిమ్మ, అరటి, సీతాఫలం వంటి పండ్లు రవాణా చేయనున్నారు. మరోవైపు పండ్లు, కూరగాయల రవాణాపై భారత ప్రభుత్వం 50% సబ్సిడీని పొడిగించింది.
మొట్టమొదటి కిసాన్ రైలును నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు 2020 ఆగస్టు 7న ప్రారంభించారు. దీనిని తర్వాత ముజఫర్‌పూర్ వరకు పొడిగించారు. ఈ సర్వీసుకు రైతుల నుండి మంచి స్పందన రావడంతో.. దాని ఫ్రీక్వెన్సీని వారానికి ఒకసారి నుంచి వారంలో మూడు రోజులు నడిచేలా మార్పు చేశారు.
కిసాన్ రైలు సేవల ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డు మార్గంతో పోల్చుకుంటే ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. అంతేకాదు రాష్ట్రం బయట పంటను అమ్ముకుంటే మంచి ధర లభిస్తుంది. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 26, 2020, 9:31 PM IST