పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ సభను ప్రారంభించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా సభా నాయకుడు, ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం చేశారు.  ఈ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో కొనసాగనుంది.