కోజికోడ్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

మరోవైపు ఘటనాస్థలికి ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు గాను కేరళ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. 056 5463903, 054 3090572, 054 3090572 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చిన తెలిపింది.

Also Read:కేరళ విమాన ప్రమాదం: పైలట్, కోపైలట్ సహా ఐదుగురు మృతి

మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై డీజీసీఏ సమగ్ర విచారణకు ఆదేశించింది. దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344 విమానం రన్‌వేపై జారిపడి రెండు ముక్కలైంది.

ప్రమాద సమయంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఏడుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రన్‌వేపై నేరు చేరి ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.