ఇటుకలతో సోషల్ డిస్టెన్సింగ్‌: చిన్నారుల వీడియోపై ముచ్చటపడిన మోడీ

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటోంది. దీనిని ఎదుర్కోవాలంటే సామాజిక దూరం, లాక్‌డౌన్‌లు మాత్రమే పరిష్కారంగా కనిపిస్తున్నాయి
PM narendra modi shares a video about social distance
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటోంది. దీనిని ఎదుర్కోవాలంటే సామాజిక దూరం, లాక్‌డౌన్‌లు మాత్రమే పరిష్కారంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు బయట తిరగకుండా ఉంటున్నారు. బయటికి వెళ్లొచ్చిన తర్వాత శానిటైజర్‌ను రాసుకుంటున్నారు.

అయితే కొందరు మాత్రం ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రముఖులు ఎంతగా మొత్తుకుంటున్నా వారు వినిపించుకోవడం లేదు. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్‌పై చిన్నారులు రూపొందించిన వీడియో ప్రధాని నరేంద్రమోడీని ఆకర్షించింది.

60 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంతమంది స్నేహితులకు ఒక చిన్నారి సామాజిక దూరం గురించి వివరిస్తున్నాడు. దీనిలో భాగంగా కొన్ని ఇటుకలను సర్పిలాకారంలో అమర్చారు.

ఒక ఇటుకను మరో ఇటుకపైకి తోస్తే, అది క్రమంగా అన్ని ఇటుకలను కిందపడేలా చేస్తుందని ఈ వీడియో ఆ పిల్లాడు వివరించాడు. అలా కాకుండా ఇటుకల మధ్య దూరాన్ని పెంచడం ద్వారా ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చని తెలిపాడు.

ఈ నేపథ్యంలో కరోనా నుంచి కూడా తప్పించుకోవాలంటే మనుషుల మధ్య సోషల్ డిస్టెన్సింగ్ పాటించక తప్పదని ఆ చిన్నారి గుర్తుచేశాడు. దీనిని చూసి ముచ్చటపడిన ప్రధాని నరేంద్రమోడీని వెంటనే ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. కోవిడ్ 19 బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే చిన్నారులు చెప్పినట్లు సామాజిక దూరం పాటించాలని సూచించారు.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios