దేశ ప్రజలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాలకు నిర్మలా సీతారామన్ చేయూతనిచ్చారని మోడీ తెలిపారు.

మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రధాని గుర్తుచేశారు. రైతుల ఆదాయం రెట్టింపవుతుందని.. ఆత్మనిర్భర్ భారత్‌కు బడ్జెట్ విజన్‌లా పనిచేస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్ననట్లు ప్రధాని పేర్కొన్నారు. ఆరోగ్య రంగం బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని మోడీ వెల్లడించారు. 2021 బడ్జెట్ భారతదేశ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే