టెస్ట్, ట్రేస్, ట్రాక్ అమలు చేయండి: వారణాసి అధికారులకు ప్రధాని ఆదేశాలు

దేశంలో రెండో దశలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొన్ని  ప్రాంతాల్లో పరిస్ధితి విషమంగా వుంది. దీంతో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించి వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం పరిస్ధితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

pm narendra modi reviews covid situation in varanasi ksp

దేశంలో రెండో దశలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొన్ని  ప్రాంతాల్లో పరిస్ధితి విషమంగా వుంది. దీంతో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించి వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ సైతం పరిస్ధితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసిలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంపై ఆదివారం అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వారణాసిలో కరోనా వైరస్‌ ముప్పు నుంచి ప్రజల్ని రక్షించేందుకు అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు.  

తొలి దశలో మాదిరిగానే వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు టెస్ట్‌, ట్రేస్‌, ట్రాక్‌ విధానాన్ని అనుసరించాలని మోడీ సూచించారు. కరోనా ముప్పును నివారించడానికి ప్రజలు, ప్రభుత్వం మధ్య సహకారం అవసరమని ప్రధాని వెల్లడించారు.

Also Read:ఇండియాలో కరోనాతో రికార్డు స్థాయిలో మరణాలు: ఒక్క రోజులోనే 1501 మంది మృతి, డేంజర్ బెల్స్

ప్రజలకు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడంపై అధికారులు అవగాహన కల్పించాలని మోడీ సూచించారు. అదేవిధంగా 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

కరోనా చికిత్స విషయంలో ప్రజలకు అన్ని రకాలుగా సహాయం అందించాలని ప్రధాని ఆదేశించారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలోనూ వైద్యులు ఎంతో నిబద్దతతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని మోడీ అభినందించినట్లు పీఎంవో ప్రకటనలో తెలిపింది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios