భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం.. రూ.100 నాణేన్ని విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టులో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన గౌరవార్ధం వాజ్ పేయి ఫోటోతో ఈ రూ.100 నాణేన్ని తయారు చేశారు. ఆ నాణేన్ని మోదీ ఈ రోజు విడుదల చేశారు. వాజ్ పేయి జయంతోత్సవానికి ఒక రోజు ముందు ఈ నాణేలను ప్రభుత్వం విడుదల చేయడం విశేషం.

వాజ్ పేయీ జయంతిని బీజేపీ సుపరిపాలన రోజుగా వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నాణేం విడుదల కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వాని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు.