ప్రధాని నరేంద్రమోదీ కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం  వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న ఆయన ఈ రోజు ఉదయం సెకండ్ డోస్ తీసుకున్నారు. తాను వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

”ఈ రోజు ఎయిమ్స్‌లో కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్నాను.. వ్యాక్సిన్ అనేది వైరస్‌ను ఓడించడానికి మనకు ఉన్న మార్గాలలో ఒకటి. మీరు టీకా తీసుకునేందుకు అర్హులు అయితే వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోండి.. దీనికోసం కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ (Http://CoWin.gov.in) చేయించుకోండి”. అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

 

కాగా.. ప్రధాని మోదీ మార్చి 1న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం 39 రోజులకు ఆయన వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకున్నారు. కాగా ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు. గతంలో మాదిరి గానే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకున్నారు.