మరోసారి వర్చువల్‌గా భేటీ అవుదాం.. బ్రెజిల్ బాధ్యతలు తీసుకోవడానికి ముందే.. ప్రధాని మోడీ ప్రతిపాదన
జీ 20 సదస్సును ముగిస్తూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జీ 20 అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్‌కు దక్కుతాయి. అయితే, అంతకు ముందే వర్చువల్‌గా సమావేశం కావాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు.

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో ముగిశాయి. తదుపరి ఏడాది జీ 20కి అధ్యక్షత చేపట్టే బాధ్యతలను బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లులా డి సిల్వాకు ప్రధాని మోడీ అప్పగించారు. నవంబర్‌లో ఈ బాధ్యతలు బ్రెజిల్‌కు వస్తాయి. అంతకు ముందే ఒకసారి సభ్య దేశాలన్నీ భారత అధ్యక్షతనలో వర్చువల్ సమావేశం కావాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు.
ఆ వర్చువల్ సెషన్‌లో ఇక్కడ నిర్వహించిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో చర్చించిన విషయాలపై మరోసారి సమీక్షించుకోవాలని ప్రధాని మోడీ తెలిపారు. తమ బృందాలు అన్ని వివరాలను సభ్యదేశాలకు అందిస్తాయని వివరించారు. దీనితో జీ 20 సదస్సు ముగిసిందని ప్రకటిస్తున్నాను అని వివరించారు.
Also Read: G20 Summit: ముగిసిన సదస్సు.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ
ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ సంతోషంగా సాగుతుందని భావిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ప్రపంచమంతటా ఆశ, శాంతి వర్దిల్లుతాయని భావిస్తున్నట్టు వివరించారు. జీ 20 అధ్యక్షత బాధ్యతలు అప్పగిస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వాకు అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో వచ్చిన సలహాలు, సూచనలను తప్పక పరిశీలిస్తామని వివరించారు. వాటిని పరిశీలించి అమలు చేయాల్సిన బాధ్యత తమ మీద ఉంటుందని తెలిపారు.