కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన ట్వీట్టర్ ద్వారా సందేశాన్ని తెలిపారు. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికులకు ప్రధాని వందనాలు సమర్పించారు.

అంతేకాకుండా కార్గిల్ గొప్పతనాన్ని తెలిపేలా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులను కలిసి వారితో గడపటాన్ని ఎప్పటికీ మరచిపోలేనని మోడీ గుర్తు చేసుకున్నారు.

1999లో తాను పార్టీ కోసం జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పనిచేస్తున్నానని.. యుద్ధ సమయంలో తనకు కార్గిల్ వెళ్లి..సైనికులను కలిసే అవకాశం వచ్చిందని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు సైనికులను కలిసినప్పటి ఫోటోలను ప్రధాని ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.