డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అంతటా యోగా జపం : నరేంద్ర మోదీ

PM Narendra Modi participated yoga international camps in Dehradun
Highlights

డెహ్రాడూన్ ఇంటర్నేషనల్ యోగా క్యాంప్ లో పాల్గొన్న ప్రధాని మోదీ

భారతదేశ వారసత్వ సంపద అయిన యోగా ఇపుడు ప్రంపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అందరూ భారతీయ యోగా ను తమ జీవితంలో భాగం చేసుకున్నారని అన్నారు. ఇందువల్ల ప్రపంచం శాంతియుతంగా, ఆరోగ్యంగా ఉంటోందని మోదీ తెలిపారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ... డెహ్రాడూన్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన అనేక ఆసనాలను వేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ... పతంజలి మహర్షి భారతీయులకు అతి విలువైన, ఆరోగ్యకరమైన యోగా ను అందించారని అన్నారు. అది ఇపుడు దేశ సరిహద్దులను దాటి విశ్వవ్యాప్తమైందని తెలిపారు. ప్రతి ఏడాది ప్రపంచం మొత్తం మోగా డే ను జరుపుకోవడమే అందుకు నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా చేరినట్టే యోగా కూడా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని  అన్నారు. యోగాను ఓ సామూహిక ప్రజాహిత కార్యక్రమమంగా మోదీ అభివర్ణించారు.

ఇక ఆ యోగా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధాని ట్వట్టర్ ద్వారా తెలియజేస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రశాంతమైన, శాంతియుత జీవితానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేసి చురుగ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలని మోదీ అన్నారు.  యోగా అందరిని ఒక్కతాటిపైకి తెస్తుందని, శత్రుత్వాన్ని తగ్గిస్తుందని, సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

 

 

loader