ప్రధాని నరేంద్రమోడీ బీహార్‌పై వరాల జల్లు కురిపించారు. దీనిలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.16 వేల కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు
ప్రధాని నరేంద్రమోడీ బీహార్‌పై వరాల జల్లు కురిపించారు. దీనిలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.16 వేల కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే పది రోజుల్లో బీహార్ ప్రజలకు మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రాజెక్ట్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు.
ఇందులో ఎల్‌పీజీ పైప్‌లైన్, ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌తో పాటు నమామి గంగే కింద మురుగునీటి శుద్ధి ప్రణాళిక, నీటి సరఫరా పథకాలు, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, కొత్త రైల్వే లైన్, రైల్వే వంతెన, వివిధ మార్గాల విద్యుదీకరణ, రహదారులు, వంతెనల నిర్మాణం తదితర రంగాలకు సంబంధించిన పనులు ఉన్నాయి.
ఇదే సమయంలో నరేంద్రమోడీ బీహార్ ప్రజలతో సంభాషించనున్నారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని తాయిలాలు ప్రకటిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
