న్యూఢిల్లీ: పన్ను రేట్లను తగ్గించడం, ప్రత్యక్ష పన్ను చట్టాల్ని సరళతరం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

పారదర్శక పన్నుల విధానం వేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 

ట్యాక్స్ చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు కొత్త పన్ను పథకాన్ని ప్రారంభించినట్టుగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్టాడారు.ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్టుగా ఆయన చెప్పారు.

నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ప్రత్యేక వేదిక ఎంతో అవసరమన్నారు మోడీ. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో ప్రత్యక్ష పన్ను సంస్కరణల ప్రయాణంలో మరో అడుగు ముందుకు పడిందని ఆయన చెప్పారు. త్వరితగతిన సేవలు పొందేలా ట్యాక్స్ పేయర్ చార్టర్ ను కేంద్రం తీసుకురానుంది.సంస్కరణలపై ఆలోచనా విధానం మారిందన్నారు. ఆర్ధిక సంస్థల పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు ఊతమిస్తాయని ఆయన చెప్పారు.