ప్రధానిగా నరేంద్రమోడీ నాలుగేళ్లకాలంలో ఎన్నో బహుమతులువ, కానుకలు అందుకున్నారు. భారత ప్రధాని హోదాలో ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా దేశ ప్రభుత్వాలు బహుమతులు అందించాయి. వీటి గురించి తెలుసుకోవాలని చాలా మందికి వుంటుంది.

అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాటిని బయటికి వెల్లడించరు. ఇలాంటి వారి కోరికను తీర్చింది కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ. మోడీ విదేశాల్లో ఇప్పటి వరకు 168 బహుమతులు అందుకున్నారు. వాటి విలువ 12.57 లక్షల రూపాయలు.

వీటిలో మోంట్ బ్లాంక్  రిస్ట్ వాచ్, వెండి పలకం, మోంట్ బ్లాంక్ పెన్ను అత్యంత ఖరీదైనవి.. వీటితో  పాటుగా బొమ్మలు, పెయింటింగులు, పుస్తకాలు, చిత్ర పటాలు, బుల్లెట్ ట్రైన్‌లు, కార్పెట్‌లు, కార్డిగాన్లు, మఫ్లర్లు, ఫాంటెన్ పెన్నులు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ బహుమతుల్లో ఎక్కువ శాతం 2017 జూలై నుంచి 2018 మధ్య అందుకున్నవే.