ప్రధాని నరేంద్ర మోడీ, యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం వాతావరణ మార్పు, వాణిజ్యం, పెట్టుబడి, భద్రత మరియు కరోనావైరస్ వ్యాక్సిన్‌తో సహా పలు కీలక అంశాలపై ముఖ్యమైన చర్చలు జరిపారు. 

ఇందుకు సంబంధించి మోడీ ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘ నేను యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో అద్భుతమైన చర్చలు జరిగాయి. భారత్ - యూకే సంబంధాల కోసం రోడ్‌మ్యాప్ కోసం చర్చలు జరిపాను. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, వాతావరణ మార్పు, కోవిడ్ -19 తో పోరాటం సహా అన్ని రంగాల్లో భారత్, యూకే అడుగు పెడతాయని మోడీ ట్వీట్ చేశారు.

కాగా, వచ్చే ఏడాది ఐక్యరాజ్యసమితి మానవతా సదస్సును యుకె నిర్వహిస్తోంది. కరోనా వైరస్ కారణంగా 2020 లో జరిగిన ఈ సమావేశం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. 

ఇదే సమయంలో బోరిస్ జాన్సన్ .. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ,పెట్టుబడి వంటి అంశాలను మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఇరువురు నాయకులు ముఖ్యమైన మార్గదర్శకాలను ప్రస్తావించారు.